![]() |
![]() |

బుల్లితెర మీద అమూల్య గౌడ అంటే గుర్తొచ్చే సీరియల్ గుండె నిండా గుడి గంటలు. ఇక నిరంజన్ అంటే గుర్తొచ్చే సీరియల్ ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ గుర్తొస్తుంది. ఇక వీళ్ళిద్దరూ కలిస్తే అదే వాళ్ళ కొత్త జీవితం. అంటే వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు అనౌన్స్ చేశారు. "మా బోనాల జాతర " లేటెస్ట్ షో ప్రోమోలో ఈ విషయాన్నీ రివీల్ చేశారు వీళ్ళిద్దరూ.
ఈ ప్రోమో చూస్తే గనక "మీకెంతో ఇష్టమైన మీ ఫేవరేట్ స్టార్ మా హీరో హీరోయిన్స్ మా బోనాల జాతరకు రాబోతున్నారు. ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ " అని శ్రీముఖి చెప్పడంతోనే ఒక రేస్ బైక్ మీద స్టైలిష్ గా వచ్చాడు నిరంజన్. "ఓహ్ మై గాడ్ నిరంజన్. నువ్వెంటి అనౌన్స్మెంట్ ఏంటి ప్లీజ్ చెప్పవా " అని శ్రీముఖి అడిగింది. "పెళ్లి చేసుకోబోతున్నాను " అంటూ తెగ సిగ్గుపడిపోయాడు. "పెళ్లి చేసుకోబోతున్నావా " అనేసరికి నిరంజన్ షాకయ్యాడు. మిగతా అంతా నవ్వేశారు. "నిరంజన్ పెళ్లాడబోతున్న ఆ వధువు ఎవరో చూసేద్దాం అనేసరికి ఒక హార్ట్ తో గ్రీటింగ్ కార్డుని ఓపెన్ చేసాడు. అందులో అమూల్య గౌడ పిక్ వుంది. దాంతో అక్కడే ఉన్న అమూల్య గౌడ సిగ్గు పడిపోయింది.
ఆమెను ఎప్పుడైతే చూశానో నా ఇల్లు నాకు దొరికినట్టుగా అనిపించింది అని చెప్పాడు నిరంజన్. "ఓహ్ సో స్వీట్ అనౌన్స్మెంట్ ఇదేనా" అంటూ శ్రీముఖి అడిగింది. "అరె కాదుకాదు. చెప్పా కదా ఇంకా చాలా బిగ్ అనౌన్స్మెంట్ ఉంది అని " అన్నాడు నిరంజన్. వెంటనే అమూల్య గౌడ "ఫస్ట్ ఎం చెప్పి ఎం చేస్తున్నారో నాకు చెప్పి చేయండి " అని చెప్పింది. దాంతో అందరూ నవ్వేశారు. ఇక నెటిజన్స్ ఐతే వీళ్లిద్దరికీ విషెస్ చెప్తున్నారు. అమూల్య చాలా లక్కీ అంటూ కన్నడలో కమ్లి సీరియల్ లో వీళ్ళు తమ ఫ్యాన్ కపుల్ అంటూ కామెంట్ చేశారు.
![]() |
![]() |